వామ్మో.. ఎంత పెద్ద బతుకమ్మ.. !

-

బతుకమ్మ అంటే ఎంత ఉంటది చెప్పండి.. మా.. అంటే ఒక అడుగు.. రెండు అడుగులు.. కానీ ఈ బతుకమ్మ చూడండి.. ఏకంగా 42 అడుగులు ఉంది.. షాకయ్యారా? దీన్ని తయారు చేయడం అంత వీజీ కాదు. ఈ భారీ బతుకమ్మను ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పెరికసింగారంలో తయారు చేవారు. ఈ బతుకమ్మను తయారు చేయడానికి ఐదు రోజులు పట్టిందట. ఈ బతుకమ్మ కోసం మూడు ట్రక్కుల టేకు పువ్వులు, రెండు ట్రక్కుల తంగేడు పువ్వులు, మూడు క్వింటాళ్ల బంతిపూలు, రకరకాల పువ్వులను ఉపయోగించారట. 70 మంది రాత్రింబవళ్లు కష్టపడి ఈ బతుకమ్మను పేర్చారట. వావ్.. సూపర్ కదా. ఇక.. ఎంత కష్టపడి చేసినా.. చివరకు దాన్ని నీళ్లలో నిమజ్జనం చేయాల్సిందే కదా. సద్దుల బతుకమ్మ సందర్భంగా దాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్లి బతుకమ్మ ఆడిపాడి సాగర్ కాలువలో నిమజ్జనం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version