నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలోనే కాకుండా రాజకీయాల్లోనూ దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా… బోయపాటి శ్రీనుతో వరుసగా హిట్స్ అందుకుంటున్న బాలయ్య… ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే అఖండ 2. ‘అఖండ’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పుడు ‘అఖండ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

ఇవాళ బాలయ్య పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. బాలయ్య డ్యూయల్ లుక్స్ అలాగే డైలాగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా ఈ టీజర్ లో తమను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలవడం జరిగింది. మొత్తానికి ఈ టీజర్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కాగా ఈ విజయదశమి సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన అఖండ 2 రిలీజ్ చేయబోతున్నట్లు మరోసారి ప్రకటించారు.