అఖిల్ టైటిల్ లీక్.. వారసుడుకి పర్ఫెక్ట్ టైటిల్..!

-

అక్కినేని అఖిల్ ఐదవ సినిమాగా వస్తున్న మూవీకి ఏప్రిల్ 8న ఉదయం టైటిల్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ రేపు రిలీజ్ అవుతుండగా ఒకరోజు ముందే టైటిల్ లీక్ అయ్యింది.

Akhil 5 Title Leaked Nag Title Using

అఖిల్ ఈసారి తండ్రి నాగార్జున టైటిల్ తో తన లక్ టెస్ట్ చేసుకోనున్నాడని తెలుస్తుంది. అఖిల్ ఐదవ సినిమా టైటిల్ గా వారసుడు అని ఫిక్స్ చేశారని టాక్. అయితే అఫీషియల్ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ గురువారం ఉదయం 9.09 నిమిషాలకు వస్తుంది. కింగ్ నాగార్జున సూపర్ హిట్ సినిమా వారసుడు టైటిల్ తో రాబోతున్న అక్కినేని వారసుడు ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా జూన్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు. బ్యాచ్ లర్ సినిమాలో అఖిల్ పూజా హెగ్దేతో రొమాన్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news