ఆధార్ కార్డు లో ఏమైనా తప్పులు ఉంటే ఇలా సులువుగా ఎటువంటి చింతా లేకుండా మార్చుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డు లో పేరు లేదా వివరాలు తప్పు పడితే ఈ విధంగా అనుసరించండి.
పేరుని మార్చుకోవడానికి మీరు ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ uidai.gov.in ని ఓపెన్ చేయండి. అక్కడ హోమ్ పేజీలో మీకు మై ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు అప్డేట్ ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి చూస్తే అప్డేట్ యువర్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్ లైన్ అని కనబడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడు మీకు సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ఆఫ్ uidai ఉంటుంది.
ఇప్పుడు అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.
క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఓటిపి వస్తుంది రిజిస్టర్ మొబైల్ కి.
దానిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చెయ్యాల్సి ఉంటుంది. వాటిని ఫిల్ చేయండి.
ఇప్పుడు మీరు ఎక్కడ అయితే మార్పులు చేయాలనుకుంటున్నారో అక్కడ ఓపెన్ చేసి అక్కడ మార్పులు చేయండి.
ఉదాహరణకి పేరు మార్చాలంటే అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు మార్చుకోవచ్చు. పేరుని అప్డేట్ చేసిన తర్వాత మీకు ఐడి ప్రూఫ్ అవసరం. ఐడి ప్రూఫ్ కింద మీరు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కార్డ్ లేదా రేషన్ కార్డ్ ని పెట్టొచ్చు. వివరాలుని ఇచ్చాక ఓటిపి వస్తుంది అప్పుడు వెరిఫై చేయాలి.
ఆధార్ కార్డు లో అడ్రస్ ని ఎలా మార్చాలి..?
అడ్రస్ ని మార్చడానికి ముందుగా మీరు resident.uidai.gov.in దీనిని ఓపెన్ చేయాలి.
ఇప్పుడు అప్డేట్ సెక్షన్లో రిక్వెస్ట్ ఆధార్ వాలిడేషన్ లెటర్ అని ఉంటుంది.
అప్పుడు సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ వస్తుంది.
మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటిపి వస్తుంది. దానిని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఎస్ ఆర్ ఎం ద్వారా లాగిన్ అవ్వండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక లెటర్ వస్తుంది.
మరోసారి వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రాసెస్ టు అప్డేట్ అడ్రస్ మీద క్లిక్ చేయండి.
మీకు వచ్చిన సీక్రెట్ కూడా ఆధారంగా మీరు అడ్రస్ ని అప్డేట్ చేయొచ్చు.
సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కొత్త ఎడ్రెస్ ని సబ్మిట్ చేయండి. అక్కడ వచ్చే యు ఆర్ నెంబర్ ని మీరు నోట్ చేసుకోవాలి.