పుష్ప సినిమా కోసం ఆస్కార్ విన్నర్..?

Join Our Community
follow manalokam on social media

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథలో అల్లు అర్జున్, లారీ డ్రైవర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. అదీగాక విలన్ గా మళయాల నటుడైన ఫాహద్ ఫాజిల్ ని తీసుకోవడం సినిమా పట్ల అంచనాలను మరింత పెరిగేలా చేసాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ పనిచేయబోతున్నాడని అంటున్నారు.

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రసూల్ పోకుట్టి, పుష్ప సినిమాకి సౌండ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారట. ఈ విషయమై అధికారికంగా సమాచారం రానప్పటికీ ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే అడవుల్లో అద్భుత శబ్దాలతో పుష్ప సినిమాని ఎంజాయ్ చేయవచ్చన్నమాట. రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...