అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్.. ఇంప్రెసివ్

-

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందని తెలిసిందే. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మరో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుందని తెలుస్తుంది. మిస్టర్ మజ్ను టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.

మిస్టర్ మజ్నులో అఖిల్ కొత్త లుక్ తో సరికొత్త జోష్ తో కనిపిస్తున్నాడు. తొలిప్రేమ హిట్ తో క్రేజీ డైరక్టర్ గా మారిన వెంకీ అట్లూరి అఖిల్ తో చేస్తున్న ఈ సినిమా కూడా ఫారిన్ లోనే ఎక్కువ షూటింగ్ జరుపుకుందట. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ టీజర్ ట్రెండీగా ఉండగా అఖిల్ జోష్ చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version