అతనితో అఖిల్.. కన్ఫాం చేశాడా..!

-

అక్కినేని నట వారసుడు అఖిల్ తన 3వ సినిమాగా తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అఖిల్ మొదటి అఖిల్, రెండో సినిమా హలో రెండు సినిమాలకు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. అయితే లేటెస్ట్ గా 3వ సినిమా సెట్స్ మీద ఉండగానే కెరియర్ లో నాలుగవ సినిమా మీద దృష్టి పెట్టాడు అఖిల్.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ డైరక్షన్ లో అఖిల్ సినిమా చేస్తున్నాడని టాక్. రవిరాజా పినిశెట్టి పెద్ద కొడుకు అయిన సత్య ప్రభాస్ దర్శకుడిగా తమ్ముడితో మలుపు సినిమా చేశాడు. అది సక్సెస్ అవడంతో మరో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అఖిల్ నాల్గవ సినిమా సత్య ప్రభాస్ తో కన్ఫాం చేశాడట.

ఈ సినిమాను తెలుగు, హింది బైలింగ్వల్ గా తెరకెక్కిస్తారట. సినిమాకు నిర్మాతగా కరణ్ జోహార్ తో పాటుగా నాగార్జున కూడా భాగమవుతాడట. అఖిల్ తో ఆది అన్న ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version