చైతు ప్లేస్ అఖిల్ కొట్టేశాడా..!

-

కింగ్ నాగార్జున కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న తనయుడికి సూపర్ హిట్ వచ్చేసింది. మజిలీతో నాగ చైతన్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జునకు బంగార్రాజు సినిమాలో కూడా చైతు నటిస్తాడని అన్నారు. కాని మజిలీతో సూపర్ హిట్ అందుకోవడంతో చైతు ఛాన్స్ కాస్త అఖిల్ కొట్టేశాడని తెలుస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సీక్వల్ గా వస్తున్న బంగార్రాజు సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నాగార్జున తాత పాత్రలో నటిస్తాడని తెలుస్తుండగా అఖిల్ మనవడి రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. చైతు ప్లేస్ లో అఖిల్ రిప్లేస్ అయ్యాడట. హీరోగా చేసిన 3 సినిమాలు ఫెయిల్ అవడంతో ఈసారి తండ్రి సాయంతో అఖిల్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా అఖిల్ సోలోగా మరో సినిమా కూడా డిస్కషన్స్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news