‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్న అక్కినేని అఖిల్ ..!

-

“బొమ్మరిల్లు” భాస్కర్ అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాతో భాస్కర్ హిట్ కొట్టి మళ్ళీ ఫాం లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు అఖిల్ కూడా ఈ సినిమాతో సక్సస్ వస్తుందన్న ధీమాతో ఉన్నాడట. ఇక ఇప్పటికే అఖి నుండి మూడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

కొత్త కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో “బన్నీ” వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. వాస్తవంగా అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కారోనా కారణంగా అన్ని సినిమాల మాదిరిగా ఈ సినిమాకి కూడా బ్రేక్ పడింది. అయితే టైటిల్ తో పాటు పోస్టర్ ఈ సినిమా పాజిటివ్ బజ్ ని క్రియోట్ చేశాయి. ఇక హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియిన్స్ లోను లక్కీ హీరోయిన్ అన్న సెంటిమెంట్ పరంగా హిట్ గ్యారెంటీ అంటున్నారు.

అయితే విశ్వనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సూపర్ హిట్ అని తెలుస్తుంది. ఫస్ట్ టైం అఖిల్ ఖాతాలో ఒక మంచి కమర్షియల్ హిట్ పడబోతుందని యూనిట్ నమ్మకంగా ఉన్నారట. అంతేకాదు అఖిల్ ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా… డాన్స్ పరంగా బాగా చేశాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ మేకోవర్.. యూత్ ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయట. మొత్తానికి అఖిల్ మొదటిసారి ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news