`అల వైకుంఠ‌పుర‌ములో` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. దద్దరిల్లిపోతున్న థియేట‌ర్లు..

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంద‌డి చేస్తోంది. దీంతో ఇక సంక్రాంతి పండగ వేళ సినిమా థియేటర్లు కళకళలాడుతున్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత బన్ని, అల్లు అర్జున్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి.

అంచనాలకి తగ్గట్టుగానే సినిమా విడుదలైన అన్ని ధియేటర్ల నుంచి హిట్ టాక్ రావ‌డంతో వీరిద్ద‌రూ హ్యాట్రిక్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. మ‌రోవైపు థమన్ కంపోజ్ చేసిన మ్యూజికల్ ఆల్బమ్ లోని అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సినిమాకు బాగా ప్ల‌స్ అయింది. అలాగే అమెరికా, న్యూజిల్యాండ్‌లో కూడా ఈ సినిమా కలెక్షన్స్‌తో రచ్చ చేస్తోంది. ఆ రెండు దేశాల్లో ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి.

ఇక అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ ప‌రంగా థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి. అల వైకుంఠ‌పుర‌ములో ఫ‌స్ట్ డే.. 26.21 కోట్ల షేర్ తో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ అనిపించుకోవడమే కాకుండా అల్ టైం ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ షేర్స్ లో 6వ స్థానంలో నిలిచింది.

‘అల వైకుంఠపురములో’ ఆంధ్ర – తెలంగాణ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం- 6.03 కోట్లు

సీడెడ్- 4.03 కోట్లు

గుంటూరు- 3.42 కోట్లు

ఉత్తరాంధ్ర- 2.9 కోట్లు

తూర్పు గోదావరి- 3 కోట్లు

పశ్చిమ గోదావరి- 2.42 కోట్లు

కృష్ణా- 3.11 కోట్లు

నెల్లూరు- 1.3 కోట్లు
—————————————————
ఫస్ట్ డే మొత్తం షేర్ – 26.21 కోట్లు
—————————————————

Read more RELATED
Recommended to you

Exit mobile version