Bigg Boss 3 : ఆలీ రెజా రీ ఎంట్రీ క‌న్‌ఫార్మ్‌..!

-

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అష్ట కష్టాలు పడుతోంది. మొదటి వారం రికార్డుస్థాయిలో టీఆర్పీ రేటింగ్ ఉన్న బిగ్ బాస్ 3 రెండోవారం నుంచి దారుణమైన రేటింగ్ లతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఎవరికివారు సేఫ్ గేమ్ ఆడుతుండ‌డంతో షో ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వడం లేదు. ఇంటిసభ్యుల మధ్య బిగ్‌బాస్ గొడవలు పెట్టేందుకు ఎన్ని టాస్క్‌లు పెడుతున్నా కూడా ఎవరికివారు సేఫ్ గేమ్ ఆడుతున్న డంతో ఎంతమాత్రం ప్రయోజనం ఉండటం లేదు.

దీనికి తోడు బలమైన ఎలిమినేట్ అవుతూ హౌస్ లో వీక్ కంటెస్టెంట్లు ఉంటున్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కచ్చితంగా ఫైనల్స్‌లో ఉంటాడని అనుకున్న ఆలీ రెజా 50 రోజులకే ఎలిమినేట్ అయ్యాడు. ఆలీ ఎలిమినేట్ అవ్వటం చాలా మందిని అసంతృప్తికి గురి చేసింది. ఇక యాక్టివ్గా ఉండే హిమ‌జ‌ కూడా బయటకు వెళ్ళిపోయింది. ఆలీ రాజా హౌస్ నుంచి వెళ్లి రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో ఆలీ హౌస్ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వ‌డ‌ని అందరూ భావించారు.

Ali Raza re entry bigg boss 3

ఒక జాతీయ ఆంగ్ల మీడియా సంస్థ అలీ రెజా ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఒక కథనుం రాసింది. స్టార్ మా వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం అందినట్లుగా ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. వీకెండ్స్‌లో నాగార్జున వ‌చ్చిన‌ప్పుడు లేదా.. వీకెండ్ ముగిసిన వెంట‌నే ఆలీ రెజా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. గత సీజన్ లో నూతన్ నాయుడు మరియు శ్యామలలు రీ ఎంట్రీ ఇవ్వగా ఈ సారి ఆ ఛాన్స్ అలీకి వచ్చింద‌ని అంటున్నారు. మ‌రో మూడు నాలుగు రోజుల్లో ఈ వార్త ఎంత నిజ‌మో తేలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version