అమ్మాయిల తొలి అనుభ‌వం ఏ దేశంలో.. ఏ వయస్సులో..?

-

సహజంగా సెక్స్ విషయంలో మగవారికి తొందరెక్కువని అంటుంటారు.. పురుషాధిక్య సమాజం కావడం వల్లనో ఏమో.. మగవాడిని తేనెటీగతో పోలుస్తారు.. మగవాడు ఎంతమందితో తిరిగినా తప్పులేదని.. స్త్రీలు మాత్రం తమ శీలం కాపాడుకోవాలని మనకు పాతకాలం నుంచి చెబుతూ వచ్చారు. అయితే కన్యత్వానికి ప్రాధాన్యత ఇచ్చే రోజులు పోయాయి.

ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలో తక్కువ వయస్సులో సెక్స్ అనుభవం పొందుతున్నారట. తాజాగా డ్యురెక్స్ ఫేస్ ఆఫ్ గ్లోబల్ సెక్స్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.

దాని ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలు సగటున 18 ఏళ్లకు కన్యత్వం కోల్పోతున్నారట. మొదటి సెక్స్ అనుభవం రుచి చూస్తున్నారట. ఇక ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. ఇంకా సంప్రదాయాలకు విలువ ఇచ్చే ఇండియా, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో సరాసరిన 20ఏళ్ల వయసులో భామలు తమ మొదటి సెక్స్ అనుభవం పొందుతున్నారట.

ఇక పాశ్చాత్య దేశాల్లో ఈ వయస్సు మరీ తక్కువగా ఉంటోందట. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో అమ్మాయిలు పదహారేళ్లకే తొందరపడుతున్నారట. ఇక ఐలాండ్, జర్మనీ బాలికలకు మరీ తొందర ఎక్కువగా ఉన్నట్టుంది. అక్కడ పదహారేళ్లు రాకుండానే ప్రియుడితో సెక్స్ అనుభవం రుచి చూసేస్తున్నారట.

రష్యాలో 19ఏళ్లకు.. గ్రీస్ లో 18 వయసులో అమ్మాయిలు అబ్బాయిలతో పక్క పంచుకుంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. వంద మందిలో కేవలం 5గురు మాత్రమే కన్యత్వానికి విలువ ఇచ్చి పెళ్లి వరకూ సెక్స్ వద్దు అంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version