`ఆర్ఆర్ఆర్‌` నుంచి త‌ప్పుకుంటున్న‌ అలియా భట్.. రీజ‌న్ అదేనా..?

-

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీయార్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా మొదట అనుకున్నట్టుగా జులై 30 వ తేదీన కాకుండా వచ్చే ఏడాది జనవరి 8 న రిలీజ్ కాబోతున్నది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వలన సినిమా ఆలస్యం అవుతున్నట్టు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా హాలీవుడ్ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక అలియా భట్‌ త్వరలోనే చిత్రీకరణలో పాల్గొంటారని, ఆమె పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణతో దాదాపు మూవీ షూటింగ్‌ పూర్తవుతుందని భావించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూణె షెడ్యూల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

పూణె షెడ్యూల్ కు ఆమె రావాల్సి ఉంది. అయితే, ఈ షెడ్యూల్ వాయిదా పడటంతో… ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ లోని బిజీ హీరోయిన్స్‌లో అలియా భట్ కూడా ఒకరు. దీంతో, ప్రతి సినిమాకు పక్కా ప్లానింగ్ తో ఆమె డేట్స్ ఇస్తుంటుంది. ఇప్పుడు రాజమౌళి చిత్రం వాయిదా పడటంతో తర్వాతి రోజుల్లో ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం అలియాకు కష్టంగా మారిందట. ఒకవేళ ఈ చిత్రం నుంచి అలియా త‌ప్పుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని అంటున్నారు. దీంతో ఆమె స్థానంలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version