ఓటిటి విడుదలకు అల్లరి నరేష్ “ఉగ్రం” రెడీ… అప్పటి నుండి స్ట్రీమింగ్ !

-

అల్లరి నరేష్ సీరియస్ గా మారిపోయి మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ మధ్య విడుదలైన ఉగ్రం మూవీ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను దక్కించుకుని, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఎంతో పకడ్బందీగా ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ కనకమేడల. ఇందులో నరేష్ పోలీస్ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు, దీనితో అల్లరి నరేష్ కెరీర్ లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉగ్రం మూవీ ఓటిటి లో రిలీజ్ అయ్యే డేట్ ఖరారు అయింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా జూన్ 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

మరి సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ అయిన ఈ ఉగ్రం మూవీ ఓటిటి లోనూ సక్సెస్ అవుతుందా లేదా అని చిత్ర బృందం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news