పాకిస్తాన్ జైలు నుండి విడుదలైన మత్స్యకారులను సన్మానించిన ప్రభుత్వం

-

మే 13వ తేదీన పాకిస్తాన్ జైలు నుంచి 1988 మధ్యకారులు విడుదలైన విషయం తెలిసిందే. వీరంతా మే 15వ తేదీ ఉదయం పంజాబ్ నుండి రైలు మార్గంలో గుజరాత్ రాష్ట్రంలోని వడోదర చేరుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మత్స్యకారులు ఉన్నారు. భారత ప్రభుత్వం చేరువతో మత్స్యకారులందరినీ పాకిస్తాన్ విడుదల చేసింది. అయితే తాజాగా పాకిస్థాన్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్మానించింది.

విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి సీదిరి అప్పలరాజును కలిశారు బాధితులు. ఈ సందర్భంగా జైలు నుంచి వచ్చిన జాలర్లకు స్వీట్ లు తినిపించారు మంత్రి అప్పలరాజు. బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారని.. జైలులో ఉన్న కాలానికి జీవన భృతి చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో వేట కోసం వెళ్లిన మత్స్యకారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పూర్తయితే మత్స్యకారుల వలసలు తగ్గుతాయన్నారు మంత్రి అప్పలరాజు.

Read more RELATED
Recommended to you

Latest news