శ్రీకాంత్ పై నమ్మకం ఉంచిన అరవింద్

-

కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్, మహేష్ లతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా టైంలో మహేష్ ఇచ్చిన కమిట్మెంట్ కోసం బ్రహ్మోత్సవం ఛాన్స్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా మహేష్ లాంటి స్టార్ హీరోతో ఇలాంటి సినిమా తీస్తాడా అని శ్రీకాంత్ వంక చూసే వారే లేకుండా పోయారు.

కొన్నాళ్లుగా తన తర్వాత సినిమా గురించి ఎనౌన్స్ చేయని శ్రీకాంత్ అడ్డాల గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా సినిమా మొదలు పెడుతున్నాడని తెలుస్తుంది. గీతా గోవిందం హిట్ తో మంచి జోష్ లో ఉన్న అల్లు అరవింద్. శ్రీకాంత్ కు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకుంటున్నాడట. శర్వానంద్ హీరో కాబట్టి సినిమాకు మినిమం గ్యారెంటీ ఉన్నట్టే.

మరి అల్లు అరవింద్ శ్రీకాంత్ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇక ఇదే కాకుండా మహేష్, సందీప్ వంగ కాంబినేషన్ లో మూవీని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version