బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో.. బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌..

-

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఇక బన్నీ లాంగ్‌ గ్యాప్‌ తరువాత నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న(నేడు) ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది.

అయితే ఇప్ప‌టికే ప్రీమియర్ షోలకు వెళ్లి సినిమా ఫ్యాన్స్ హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. సినిమా విష‌యానికి వ‌స్తే.. మెయిన్ అట్రాక్షన్ అయిన అల్లు అర్జున్ సరికొత్త లుక్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ క్రియేట్ చేశాడు త్రివ‌క్ర‌మ్‌. ఇకపోతే అల్లు అర్జున్ వన్ మాన్ ఆర్మీలా సినిమా మొదటి నుంచి చివరి దాకా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫన్ ఎలిమెంట్స్‌, అదిరిపోయే పాటలు, ఫ్యామిలీ ఎమోష‌న్ ప్రేక్ష‌కుల‌ను చ‌క్క‌గా ఆక‌ట్టుకుంది.

ఇక ప్రీమియ‌ర్ షోలు చూసిన అభిమానులు స్టైలిష్‌ స్టార్‌ అభిమానులు బన్నీ ఇరగదీశాడు, బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటుంటే.. కామన్‌ ఆడియన్స్‌ మాత్రం త్రివిక్రమ్‌ టేకింగ్‌లో లోటు పాట్లను ఎత్తిచూపిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మార్క్ డైలాగులతో పాటు అదిరిపోయే పాటలతో ఫస్ట్ హాఫ్ జాలీగా సాగిపోతుందని తెలుస్తోంది. అంతేకాదు ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎంతో ఆసక్తిగా ఉందని చెబుతున్నారు కొంద‌రు. అయితే సెకండ్ హాఫ్‌లో కాస్తా అక్కడక్కడా కొన్ని సీన్‌లు స్లో అనిపించినా.. పూర్తి ఫీల్‌తో ఎంజాయ్ చేసే విధంగా సినిమాను రూపొందించారని అంటున్నారు ఫ్యాన్స్. దీనిని బ‌ట్టీ చూస్తుంటే బ‌న్నీ ఖాతాలో మ‌రో సూప‌ర్ డూప‌ర్ హిట్ ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news