బాలీవుడ్‌ స్టార్ హీరోలతో అల్లు అర్జున్‌ సందడి.. ఫొటోలు వైరల్‌

-

బాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్ మధు మంతెన.. ఐరా త్రివేదిల వివాహం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ప్రముఖ యోగా ట్రైనర్‌ ఐరా త్రివేదిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. అలాగే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కూడా హాజరయ్యాడు. ఈ వేడుకలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సూపర్ స్టార్స్.. హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్​లను కలిశారు. వారితో కాసేపు ముచ్చటించి ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆమిర్, హృతిక్, అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫొటోలను ప్రస్తుతం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. ‘పుష్ప’తో బన్నీ సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ భారీగా అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఐకాన్‌ స్టార్‌తో సినిమాలు తీసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘పుష్ప 2’ షూటింగ్‌ పూర్తవ్వగానే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news