బన్ని పాంచ్ పటాకా..!

-

మాటల మాంత్రికుడు త్రివిక్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుందని తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రం, బన్ని కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ మూవీ చేస్తాడని తెలుస్తుంది.

ఇదేకాకుండా విక్రం కుమార్ సినిమాకు ఓకే చెప్పాడట.. ఇదిలాఉంటే తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీ ప్లానింగ్ లో ఉన్న అల్లు అర్జున్ మురుగదాస్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇదే కాకుండా మరో తమిళ దర్శకుడికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. అంటే బన్ని దాదాపుగా ఐదు సినిమాలు ఒకేసారి ప్లాన్ చేసుకున్నాడు. నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత బన్ని కథల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. మరి ఈ పాంచ్ పటాకాల్లో ఏది బ్లాక్ బస్టర్ అవుతుంది.. ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version