పాలకొల్లు కోసం బన్ని సాయం

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతిని తన సొంత ఊరు పాలకొల్లులో జరుపుకున్నారు. సకుటుంబ సమేతంగా పాలకొల్లులో పొంగల్ ను సంతోషంగా జరుపుకున్నాడు బన్ని. ఇక అక్కడ అల్లు రామలింగయ్య విగ్రహం దగ్గర అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో పాలకొల్లు కోసం ఓ కళ్యాణ మండపం కట్టిస్తున్నట్టు ప్రకటించాడు అల్లు అర్జున్.

సొంత ఊరి కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఇలా కళ్యాణ మండపం అయితే బెటర్ అని భావించి దానికి సంబందించిన పనులు చూసుకుంటానని హామి ఇచ్చాడు బన్ని. ఈమధ్య సేవ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తున్న బన్ని కేరళ వరద బీభత్సానికి పాతిక లక్షల సాయం చేయగా తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి ఆర్వో వాటర్ ఫ్యూరిఫైర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పుడు పాలకొల్లు కోసం కళ్యాణ మండపం కట్టిస్తానని ప్రకటించాడు. బన్ని చేస్తున్న ఈ మంచి పనులకు ఫ్యాస్ సంతోషంలో తేలియాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news