అల్లు అర్జున్ అరుదైన ఘ‌న‌త.. ఇన్‌స్టాలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్

పుష్ఫ పార్ట్ 1 సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంలో ఒక‌టి అయిన ఇన్ స్టాగ్రామ్ లో ద‌క్షిణ భార‌త‌దేశంలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ కలిగిన హీరోల‌లో అల్లు అర్జున్ మొద‌టి స్థానంలో ఉన్నారు. తాజా గా ఆయ‌న ఇన్ ష్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 15 మిలియ‌న్లకు చేరుకుంది. దీంతో ఆయ‌న ఈ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

చాలా త‌క్కువ స‌మ‌యంలోనే 1.5 కోట్ల మంది ఫాలోవ‌ర్స్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపాదించుకున్నాడు. కేవ‌లం నాలుగున్న‌ర ఏళ్ల‌లోనే అల్లు అర్జున్ ఈ ఫీట్ ను సాదించాడు. కాగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో అత్య‌దిక ఫాలోవ‌ర్స్ అందుకోవ‌డంతో ఆయ‌న అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కాగ అల్లు అర్జున్ పుష్ప‌తో పాటు ఇటీవ‌ల వ‌చ్చిన సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకున్నాయి. పుష్ప‌, అలా వైకుంఠ‌పూరంలో.. తో పాటు ప‌లు సినిమాలు ఇండ‌స్ట్రీ హిట్ ను అందుకున్నాయి. దీంతో అల్లు అర్జున్ కు అభిమానులు పెరుగుతున్నారు.