అల్లు అర్జున్ లుక్ లీక్.. ఊర మాస్‌గా బన్నీ

-

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అని ఊరికే అనలేదు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపించడం, క్యారెక్టర్‌కు తగ్గట్టు బాడీని మార్చేయడం, క్యాస్టూమ్‌ను దగ్గరుండి పరిశీలించడం, స్టైలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం చేస్తూ స్టైలీష్ స్టార్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. ఇక తన తదుపరి చిత్రం కోసం సిద్దమవుతున్నాడు.

సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ రెడీ అవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్ర చందన స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని, దానికి తగ్గట్టే బన్నీ లుక్స్, యాస అన్నీ కొత్తగా అందర్నీ ఆశ్చర్య పరిచేలా ఉంటాయని టాక్. ఇప్పటికే కేరళ అడవుల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ యూనిట్‌కు తాజాగా ఓ షాక్ తగిలింది.

కేరళలో కరోనా విస్తరిస్తుండటంతో అక్కడ షూటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీంతో షూటింగ్ క్యాన్సల్ అయింది. అయితే తాజాాగా అల్లు అర్జున్ లుక్ బయటకు వచ్చింది.తన బాడీగార్డ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న బన్నీ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బన్నీ లారీ డ్రైవర్‌గా ఊరమాస్ లుక్‌లో కనిపించబోతోన్నాడని అర్థమవుతూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news