Allu Arjun : నోటిలో సిగార్‌తో బన్నీ..న్యూ లుక్‌ తో పూనకాలే

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ‘పుష్ప’..పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఈ ఫిల్మ్ కు చక్కటి ఆదరణ లభించింది. ఐకాన్ స్టార్ యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-బన్నీల హ్యాట్రిక్ ఫిల్మ్..రికార్డులను తిరగరాసింది.

హిందీ బెల్ట్ లో అనగా నార్త్ ఇండియాలో అయితే ప్రజలు ఈ పిక్చర్ చూసి వావ్ అనుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా బన్నీ లుక్‌ వైరల్‌ అవుతోంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో యాడ్‌ షూటింగ్‌ లో బన్నీ పాల్గొన్నారు.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వం రూపొందుతున్న యాడ్‌ ఆస్ట్రాల్‌ పైపుల కోసం చేస్తున్నారు. తాజాగా ఈ యాడ్‌ కు సంబంధించి లుక్‌ ను అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. చెవికి రెండు పోగులు, కొద్దిగా నెరిసిన జుట్టు, నోటిలో సిగార్‌, కళ్లకు కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని ఊర మాస్‌ కనిపించారు బన్నీ. ప్రస్తుతం ఈ ఫోటో సోసల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version