సినిమా కోసమే అలా చేశాను.. రియల్ లైఫ్ లో దానికి చాలా దూరం అంటున్న బ‌న్నీ

-

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురములో’.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ సేఫ్ జోన్‌కు తీసుకొచ్చిన ఈ చిత్రం మూడో వారం కూడా కుమ్మేసింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించడంతో చిత్రబృందం వరుసగా సక్సెస్ మీట్ లు నిర్వహిస్తూ హుషారెత్తిస్తోంది. తాజాగా ఓ సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తమను కూడా విజయోత్సవాల్లో భాగం చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటినించో అడుగుతున్నారని, వాళ్ల కోసం తప్పకుండా ఓ ఫంక్షన్ నిర్వహిస్తానని అప్పట్లో మాటిచ్చానని తెలిపారు. ఇప్పుడు అల… వైకుంఠపురములో చిత్రం అదిరిపోయే హిట్ కావడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అయితే, తాను ఈ సినిమాలో ‘సిత్తరాల సిరపడు’ పాటలో పొగ తాగుతూ కనిపిస్తానని, కానీ అది సినిమా కోసం చేసిందని, దయచేసి అభిమానులెవరూ తనను ఫాలో కావొద్దని హితవు పలికారు. రియల్ లైఫ్ లో తాను సిగరెట్లకు చాలా దూరంగా ఉంటానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news