క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా…!

-

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 5 టి20లో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కివీస్ జాగ్రత్తగా ఆడి విజయం దిశగా వెళ్ళినా కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో ఓటమి పాలైంది. ఆదిలోనే భారత్ ఓపెనర్ సంజూ స్మ్యామ్సన్ వికెట్ కోల్పోయినా జాగ్రత్తగా ఆడుతూ వచ్చింది.

ఓపెనర్ కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ని నిర్మించారు. ఇద్దరు కలిసి రెండో వికెట్ కి దాదాపు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దూకుడుగా ఆడుతూ కివీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో 45 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ బెన్నెట్ బౌలింగ్ లో 33 బంతుల్లో రెండు సిక్సులు నాలుగు ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత రోహిత్ కి జత కలిసిన శ్రేయాస్ అయ్యార్ జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. 41 బంతుల్లో మూడు సిక్సులు మూడు ఫోర్లతో 60 పరుగులు చేసాడు. ఇక ఇక్కడి నుంచి కీవీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది.

రోహిత్ తర్వాత వచ్చిన శివం దూబే పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆఖర్లో మనీష్ పాండే సిక్స్ ఫోర్ తో మెరుపులు మెరిపించడంతో టీం ఇండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ 31 బంతుల్లో 1 ఫోర్ రెండు సిక్సులతో 33 పరుగులు చేసాడు. దీనితో నిర్ణీత ఓవర్లలో టీం ఇండియా 163 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో కుగ్గేలేజిన్ రెండు వికెట్లు తీయగా బెన్నెట్ ఒక వికెట్ తీసాడు.

ఆ తర్వాత బరిలోకి దిగిన కీవీస్ కి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేదు. గుప్తిల్ రెండు పరుగులు చేసి అవుట్ కాగా రెండు ఫోర్లు ఒక సిక్స్ తో ఊపు మీదున్న మున్రో ని సుందర్ బౌల్డ్ చేసాడు. గుప్తిల్ తర్వాత వచ్చిన సేయిఫ్రేట్ దూకుడుగా ఆడాడు. మున్రో తర్వాత వచ్చిన టామ్ బ్రూస్ పరుగులేమి చేయకుండానే రనౌట్ అయ్యాడు. అయ్యాడు. ఇక బ్రూస్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సీనియర్ ఆటగాడు రాస్ టేలర్, సేయిఫ్రేట్ తో కలిసి బాధ్యతాయితంగా ఆడాడు.

ఇద్దరు కలిసి దాదాపు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సైని విడదీశాడు. 30 బంతుల్లో 3 సిక్సులు 5 ఫోర్లతో 50 పరుగులు చేసి సేయిఫ్రిట్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ ని బూమ్రా అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసాడు. ఆ తర్వాత టేలర్ జాగ్రత్తగా ఆడుతూ అర్ధ సెంచరి పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

రోహిత్ కి గాయం కావడంతో కెఎల్ రాహుల్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. కీలక సమయంలో అర్ధ సెంచరి చేసిన టేలర్ ని ఠాకూర్ అవుట్ చేసాడు. ఈ సమయంలో మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది కివీస్. అయితే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో కివీస్ లోయర్ ఆర్డర్ ఒత్తిడి తట్టుకోలేకపోయింది. ఆఖర్లో ఇష్ సోది రెండు సిక్సులు కొట్టి భారత శిభిరాన్ని కంగారు పెట్టాడు. 2 పరుగులకు 9 పరుగులు అవసరమవగా 5వ బంతికి పరుగులు రాకపోవడంతో కివీస్ ఓటమి లాంచనం అయింది.  భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయం సాధించింది. భారత బౌలర్లలో బూమ్రా 3 వికెట్లు తీయగా… సైని, ఠాకూర్ తలో రెండు వికెట్లు, సుందర్ ఒక వికెట్ తీసాడు. ఇరు జట్ల మధ్య తొలి వన్డే హామిల్టన్ వేదికగా ఈ నెల 5న జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news