Allu Arjun : అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ వచ్చేసింది

-

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై భారీ విజయాన్ని అందించడమే కాకుండా నార్త్ ఇండియాలో ఎటువంటి అంచనాలు లేకుండా వంద కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు సృష్టించింది. ఇక అందులో భాగంగానే పుష్ప సీక్వెల్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బన్నీ.

అయితే పుష్ప రెండో భాగం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అయితే ఈరోజు సర్ప్రైజ్ ఇస్తానన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… ఇంస్టాగ్రామ్ తో కొలాబరేట్ అయి… ఓ వీడియోను షేర్ చేశారు. పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో అందులో చూపించారు. ఇండియాలోనే అతిపెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోందని… అక్కడ చాలామంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీ చెప్పారు. పుష్ప రెండో భాగం లో తనది నెవర్ గివ్ అప్ క్యారెక్టర్ అని మూవీ పై అంచనాలను పెంచారు అల్లు అర్జున్.

Read more RELATED
Recommended to you

Latest news