పుష్ప 2 కోసం అల్లు అర్జున్ పారితోషకం ఎన్ని కోట్లంటే..?

-

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇకపోతే పుష్ప సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకోవడంతో ప్రస్తుతం అందరి చూపు అల్లు అర్జున్ పైనే ఉందని చెప్పాలి. ఇకపోతే ఈ అవార్డు రావడంతో టాలీవుడ్ లో మరో మెట్టు ఎక్కిన అల్లు అర్జున్.. గత రెండు రోజుల నుంచి పుష్ప 2 కి సంబంధించిన వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా ద్వారా టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. జాతీయ అవార్డు లభించడం వల్లే ఆయన పారితోషకం కూడా పెరిగిపోయిందని.. అంతేకాదు ఈ సినిమా హక్కులను బాలీవుడ్లో ఏకంగా రూ.125 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. ఇకపోతే పుష్ప 2 రెమ్యునరేషన్ కి బదులుగా నార్త్ ఇండియా రైట్స్ ని బన్నీ తీసుకున్నాడని, దీంతో ఈ సినిమాకు గాను ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ రూ.125 కోట్లని సమాచారం.

ఇకపోతే టాలీవుడ్ లోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టించబోతున్నారు అల్లు అర్జున్. ఇకపోతే ఇప్పటివరకు ప్రభాస్ మాత్రమే రూ.100 కోట్ల పారితోషకంతో టాప్ లో ఉండగా.. దానిని బ్రేక్ చేస్తూ అల్లు అర్జున్ రూ.125 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ ఉండటంతో బన్నీ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. మొత్తానికి అయితే నేషనల్ అవార్డు పుణ్యమా అని అల్లు అర్జున్ పారితోషకం కూడా పెరిగిపోయింది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news