BREAKING: మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లనున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఈరోజు మధ్యాహ్నం చిరంజీవి ఇంటికి వెళ్లనున్నారు అల్లు అర్జున్. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చిరంజీవి ఇంటికి వెళ్లనున్నారు అల్లు అర్జున్. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇక అటు అల్లు అర్జున్ కు మరో షాక్ ఇచ్చారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హైదరాబాద్ కు వచ్చి..ఏపీకి వెళ్లిపోయారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నిన్న రాత్రి హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్….ఈ రోజు ఉదయం విజయవాడకి తిరిగి వెళ్లిపోయారు. ఇందులో భాగంగానే… గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.