గ్రూప్-2 ఉద్యోగులకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

-

రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు రెండు రోజుల పాటు గ్రూప్-2 పరీక్షలు రాస్తున్న ఉద్యోగార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించి..తెలంగాణ ప్రభుత్వంలో చేరి రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగస్వాములుకావాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. అటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సహా మంత్రులంతా గ్రూప్ 2 అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆది,సోమవారాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 1,368 కేంద్రాల్లో నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలకు 5.51లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు.ఫలితాల విడుదలలో జాప్యం లేకుండా ఈ ధఫా మార్చి నెలాఖరుకల్లా గ్రూప్ 1,2,3పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version