అల్లు రామలింగయ్య కు అవకాశాలు రాకుండా చేసిన అల్లు అరవింద్.. అసలు నిజాలు బయటపెట్టిన దర్శకుడు రాఘవేంద్రరావు..

-

ప్రతి వారం అన్‌స్టాపబుల్‌ 2 టాక్‌ షోతో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆ కార్యక్రమ తాజా ఎపిసోడ్‌కు దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు, నిర్మాతలు డి.సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌ అతిథులుగా వచ్చారు. తెలుగు సినిమా’కు 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను రూపొందించారు.. ఈ షోలో జరిగిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.. ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్ తన తండ్రి అల్లు రామలింగయ్య కోసం చెప్పిన విషయాలు అందరూ చర్చించుకునేలా చేశాయి..

స్టార్ కమెడియన్ గా అల్లు రామలింగయ్య దశాబ్దాల పాటు వెండితెరపై నవ్వులు పూయించారు. ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా మారి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. దానికి పునాది వేసిన అల్లు రామలింగయ్యకు కొడుకు అల్లు అరవింద్ అవకాశాలు రాకుండా చేశాడంటే నమ్మకం కష్టమే. కానీ ఇదే నిజం. ఈ పచ్చి నిజాన్ని సీనియర్ దర్శకులు కే రాఘవేంద్రరావు బయటపెట్టారు.

ఈ క్రమంలో బాలకృష్ణ మా తండ్రులు మా గురించి మీకు ఏమి చెప్పారో చెప్పాలని కోరారు. దానికి అల్లు అరవింద్ ని వాళ్ళ నాన్న నానా తిట్లు తిట్టేవాడు. అల్లు అరవింద్ నా వద్దకు వచ్చి… ఇది మా ఫ్యామిలీ మేటర్. మీరు నాన్నకు వేషాలు ఇవ్వకండి. ఆయనకు వయసు పైబడింది, అని చెప్పి వెళ్లేవారట. అల్లు అరవింద్ వెళ్ళిపోయిన కాసేపటికి అల్లు రామలింగయ్య రాఘవేంద్రరావు దగ్గరకు వచ్చేవాడట. వేషం లేదని చెబితే… ఏంటి మా వాడు వచ్చాడా? నాకు తెలుసు వాడే నాకు వేషం ఇవ్వొద్దని చెప్పి ఉంటాడని, అల్లు అరవింద్ ని తిట్టేవాడట. గతంలో జరిగిన ఈ విషయం చెప్పి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నవ్వులు పూయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version