ఐకానిక్ స్టార్ కోసం అల్లు అర‌వింద్ స్కెచ్‌.. స్టార్ డైరెక్ట‌ర్‌ను లైన్ లో పెట్టేశాడుగా!

ఎర్ర‌తోలు క‌దా స్టైల్ గా ఉంటాడ‌నుకుంటున్నావేమో.. మాస్ ఊర‌మాస్ అంటూ దుమ్ములేపే డైలాగులు చెప్పే బ‌న్నీ ఎన‌ర్జీ గురించి అంద‌రికీ తెలిసిందే. పాత్ర ఏదైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్టు.. అందుకు త‌గ్గ‌ట్టు త‌న లుక్ ను రెడీ చేసుకుంటాడు. చాలామంది హీరోలు ఎప్పుడూ ఒకే లుక్ లో క‌నిపిస్తుంటారు. కానీ బ‌న్నీ మాత్రం అందుకు భిన్నంగా క్యారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్లు త‌న‌ను తాను రెడీ చేసుకుంటాడు. హేర్ స్టైల్ ద‌గ్గ‌ర్నుంచి, డ్యాన్సుల వ‌ర‌కు ఆయ‌న స్టైలే వేరు. అలాంటి ఐకానిక్ స్టార్ గురించి ఇప్పుడు ఓ లేటెస్టు న్యూస్ చెక్క‌ర్లు కొడుతోంది.

ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న పుష్ప‌మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమాను ఓ ఎర్ర‌చంద‌నం దొంగ‌ల బ్యాక్ డ్రాప్ గా తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న కొర‌టాల శివ‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ శివ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండ‌టంతో.. బ‌న్నీ ప్రాజెక్టు ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తోంది.

ఇక ఈ గ్యాప్ లో అల్లు అర‌వింద్ కొడుకు కోసం ఓ స్టార్ డైరెక్ట‌ర్ ను లైన్ లోపెట్టేశారు. త‌మిళ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ఇప్ప‌టికే బ‌న్నీకి క‌థ చెప్పార‌ని, దీన్ని అర‌వింద్ నిర్మిస్తార‌ని తెలుస్తోంది. ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవ‌ల్ లో ఉంటుంద‌ని తెలుస్తోంది. పుష్ప మూవీ త‌ర్వాత దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇది గ‌జినీ త‌ర‌హా క‌థ అని స‌మ‌చారం. మ‌రి దీనిపై త‌ర్వ‌లో ప్ర‌క‌ట‌చేసే వ‌ర‌క వేచి చూడాలి.