మళ్లీ కనిపించని అల్లు శిరీష్.. అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..?

టాలీవుడ్ లో అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవి ఎన్నో సినిమాలు నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక అల్లు కుటుంబంలోని హీరోలుగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందగా అల్లు శిరీష్ మాత్రం సరైన సక్సెస్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఊర్వశివో రాక్షసివో అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు.

అల్లు శిరీష్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కానీ తన అన్న అల్లు అర్జున్, తన తండ్రి అల్లు అరవింద్ లాగా అల్లు శిరీష్ దూకుడు చూపించలేకపోతున్నారు. కేవలం సినిమాలు విడుదలయ్యేటప్పుడు తప్ప మరెప్పుడూ కూడా అల్లు శిరీష్ కనిపించలేదు. దీంతో అల్లు శిరీష్ అభిమానులు ఆల్లు కాంపౌండ్ లో అసలు ఏం జరుగుతుంది అంటూ పలు రకాలుగా ఆందోళన చెందుతున్నారు. ఊర్వశివో రాక్షసివో సినిమా ముందు వరకు అల్లు ఫ్యామిలీ, అల్లు శిరీష్ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వైరల్గా మారాయి కానీ … ఇలాంటి విషయాలపై అల్లు శిరీష్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఇప్పుడు తిరిగి మళ్ళీ అల్లు శిరీష్ కనిపించకపోవడంతో అసలు సినిమాలలో నటిస్తున్నారా లేదా అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇది వరకే అల్లు శిరీష్ సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నారా లేకపోతే మరేదైనా ఉద్దేశం ఉందా.. అసలు అల్లు కాంపౌండ్లు ఏం జరుగుతోందో క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు శిరీష్ గురించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.