హైదరాబాద్ శివార్లలో అల్లు స్టుడియో.. ఎక్కడో తెలుసా?

-

తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్, సినిమా వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క ఓటీటీ వేదికలకి డిమాండ్ పెరుగుతున్నందున ఆహా యాప్ ద్వారా అందులోకి కూడా ప్రవేశించాడు. ఐతే తాజాగా స్టూడియో నిర్మాణం చేపడుతున్నామంటూ ప్రకటన ఇచ్చాడు. అల్లు రామలింగయ్య 99వ పుట్టినరోజుని పురస్కరించుకుని అల్లు స్టూడియో నిర్మాణంపై ప్రకటన వెలువడింది.

ఈ మేరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్ తో పాటు ముగ్గురు కుమారులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో స్టూడియో నిర్మాణ పనులు మొదలవుతాయని తెలియజేసారు. తాజా సమాచారం ప్రకారం అల్లు స్టూడియో గండిపేటలో నిర్మితం అవుతుందట. టీవీ కార్యక్రమాలతో పాటు సినిమా షూటింగులకి అనుగుణంగా స్టూడియో నిర్మాణం జరగనుందట. మొత్తానికి ఇప్పటికే ఫిల్మ్ హబ్ గా పేరున్న హైదరాబాద్ కి అల్లు స్టూడియో ద్వారా మరింత ప్రత్యేకత రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news