తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు నుండి అక్కినేని అఖిల్ వరకు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబం నుంచి హీరోలుగా వచ్చి తామేంటో నిరూపించుకుంటున్నారు. ఇక అక్కినేని నాగార్జున నవమన్మధుడు గా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. నాగార్జున ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోగా చలామణి అవుతూ పలు వెబ్ సిరీస్లు, సినిమాలు, షోలకు హోస్ట్గా కూడా వ్యవహరిస్తూ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఆయన భార్య అమల కూడా గతంలో హీరోయిన్ గా నటించి ఎన్నో సినిమాలలో నుంచి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ తాను కూడా సంపాదిస్తోంది.
నాగార్జున మొదటి భార్య లక్ష్మి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దగ్గుబాటి రామానాయుడు కూతురుగా ఈమె తండ్రి కోరిక మేరకు నాగార్జునను వివాహం చేసుకుంది. నాగచైతన్య జన్మించిన కొన్ని సంవత్సరాలకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే కొన్ని సంవత్సరాల పాటు లక్ష్మీ దగ్గర పెరిగారు చైతన్య.. చైతన్య ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి దగ్గర్లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా అమల నాగచైతన్య గురించి మాట్లాడుతూ..ఆయన తల్లి లక్ష్మి గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నాగ చైతన్య అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చేవాడు.. నాగచైతన్య నా దగ్గర పెరగలేదు.. వాళ్ళ అమ్మ పెంచింది.. చిన్నప్పుడు చెన్నైలోనే వాళ్ళ అమ్మ దగ్గరే ఉండే వాడు. వాళ్ళమ్మ నాగచైతన్యను చాలా పద్ధతిగా , సంస్కారవంతంగా పెంచింది. ఇక చదువుకునే సమయంలో కూడా నాగచైతన్య అప్పుడప్పుడు హైదరాబాద్ కి వస్తూ ఎక్కువ సమయం వాళ్ళ నాన్నతో గడిపేవాడు.
అఖిల్ కూడా చైతన్య వచ్చాడంటే చాలు తోకలాగా వెంటే తిరుగుతూ అన్న వచ్చాడు అంటూ సంబరపడిపోతూ ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవారు. ఇక చైతన్య ఇంటికి వచ్చాడు అంటే అఖిల్ కి నేను అస్సలు గుర్తు ఉండను. ఇద్దరూ చాలా సంతోషంగా ఆడుకుంటూ సమయాన్ని గడిపే వారు. అఖిల్ హైపర్ యాక్టివ్.. కానీ చైతన్య సైలెంట్ గా ఎంతో పద్ధతిగా ఉండేవాడు అంటూ అమల తెలిపింది. అమల.. లక్ష్మి గురించి ఇలా గొప్పగా మాట్లాడడంతో ఈ విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి.