రామ్ చరణ్ RC16లో మరో బాలీవుడ్ స్టార్!

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC16 చిత్రబృందం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. దీనికి ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో చరణ్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనుంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్, యానిమల్ విలన్ బాబీ దేఓల్ కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది.

అయితే ఇప్పుడు ఈ పుకార్లతో పాటు ఆర్సీ 16కు సంబంధించి మరో క్రేజీ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్చరణ్ పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లో తీయాలని బుచ్చిబాబు భావిస్తున్నారట. అందుకోసమే ఈ చిత్రంలో పాన్ ఇండియా నటులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చ్ను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news