దేవరకొండ తమ్ముడి ఛాయిస్ కి రెస్పాన్స్ అదిరిపోతుంది..

-

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాకి పెద్దగా స్పందన రాకపోయినప్పటికీ, నటనపరంగా ఆనంద్ కి మంచి మార్కులు పడ్డాయి. తన మొదటి సినిమాని విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించడంతో అందరి దృష్టి ఆనంద్ మీద పడింది. ఐతే తాజాగా ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్టుగా అమెజాన్ లోకి వచ్చేస్తుంది.

ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ దక్కించుకుని, చర్చనీయాంశంగా నిలిచింది. నవంబరు 20వ తేదీ నుండి అమెజాన్ లో అందుబాటులో ఉండనున్న ఈ సినిమాపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news