Anasuya : డ్యాన్స్‌తో నవ్వించిన సుమ, అనసూయ..!

-

అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో తో బుల్లితెరకు గ్లామర్ అద్దిన అనసూయ చాలా కాలం పాటు ఈ షోలో సాగుతూ వచ్చింది. సినిమాలతో పాటు ఇతర కార్యక్రమాలు చేసినప్పటికీ అనసూయ జబర్దస్త్ ను వదలలేదు. అయితే కొద్ది రోజుల క్రితం అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పి సినిమాలతో పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఇక ఎప్పటి మాదిరిగానే సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది.

ఇక అటు యాంకర్‌ సుమకు యూట్యూబ్ ఛానల్ ఉందని, అందులో ఆమె రెగ్యులర్ గా వీడియోలు చేస్తుంటారని మనందరికీ తెలిసిందే. తాజాగా ఆమె దసరా సందర్భంగా అనసూయతో కలిసి ఒక స్పెషల్ వీడియోని చేశారు. క్రేజీ కిచెన్ పేరుతో ఒక ఎపిసోడ్ నీ చేశారు.

ఈ ఎపిసోడ్ లో భాగంగా అనసూయ, సుమ ఇద్దరు కలిసి ఒక రిల్ చేశారు. ఈ రీల్ లో బాతుల్లా స్టెప్పులు వేశారు. బాతుల్లా అడుగులు అడుగు వేసుకుంటూ చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ రీల్ ని సుమ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సుమ ఏడాది క్రితం “క్రేజీ కిచెన్” సీజన్ ని స్టార్ట్ చేశారు. అయితే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మధ్యలో ఆపేశారు. తాజాగా అనసూయతో సీజన్ 2 ని స్టార్ట్ చేశారు.

 

https://www.instagram.com/reel/Ci9mTn5JcCu/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news