బుధవారం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సమావేశాల నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై మాట్లాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని పెంపొందించే విదంగా ఏర్పాట్లు ఉండాలి. ఈసారి జరిగేవి బడ్జెట్ సమావేశాలు.. ఎక్కువ రోజులు జరుగుతాయి. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలనీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఆలాగే ఒక శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి. సభ లోపలితో పాటుగా, పరిసరాలలో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు బాగా జరుగుతాయి. సభ జరుగుతున్న సమయంలో ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్ధవంతంగా, చురుకుగా పనిచేయాలి. గౌరవ సభ్యులుసమయానికి సజావుగా శాసనసభకు చేరుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలి అని స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు.