టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. అందులో అనసూయ ఒకరు. యాంకర్ గా పరిచయమైన అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకున్నారు. సినిమాల్లో నటిస్తూ కూడా మంచి పేరు తెచ్చుకుంటోంది అనసూయ.

ఇది ఇలా ఉండగా, తన డ్రెస్సింగ్ స్టైల్‌పై వచ్చిన విమర్శలకు నటి అనసూయ బోల్డ్‌గా స్పందించారు. బోల్డ్‌గా ఉండటం అగౌరవంగా ప్రవర్తించడం కాదని, తన జీవన విధానాన్ని విమర్శ తగదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తల్లి, భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన స్టైల్‌ను ప్రతిబింబించే దుస్తులు ధరించడం ఆనందంగా ఉంటుందని చెప్పారు. భర్త, పిల్లల మద్దతుతో ముందుకు సాగుతున్న అనసూయ, విలువలను కోల్పోకుండా బోల్డ్‌గా జీవించడం తన నిర్ణయమన్నారు.