గ్రామీణ పేద ప్రజలకు ఇల్లు కల సాకారం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది.1985లో గ్రామంలో ఉండే పేద ప్రజలకు భూమిలేని ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా ఈ పథకం ప్రారంభమైంది.ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి,తక్కువ ఆదాయం ఉన్న వర్గాల వారికి, మధ్య ఆదాయ వర్గాల వారికి లబ్ది చేకూరనుంది.గుడిసెల్లో నివసించే వారికి పక్కా ఇల్లు అందించడం లక్ష్యంగా ఈ పథకం ప్రవేశపెట్టారు.తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం కింద 2.5 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరింది ఆ వివరాలు చూద్దాం..
PMY- రెండు భాగాలుగా విభజించబడింది.మొదట గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికీ,గుడిసెల్లో లేదా శిథిలమైన ఇళ్లలో నివసించే వారికి పక్కా ఇళ్లను అందించడం జరుగుతుంది.ఇక పట్టణాల్లో ఆర్థికంగా వెనుకబడిన తక్కువ ఆదాయం కలిగిన పేద ప్రజలకు సరైన గృహాలను అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఈ పథకం ద్వారా 2029 నాటికి దేశవ్యాప్తంగా4.95 కోట్ల గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక తెలంగాణలో ఈ లక్ష్యంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు లక్షలాది ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి.
తెలంగాణలో PMAY అమలు: తెలంగాణలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకం అమలు చేయబడుతుంది.2025 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 3.34 కోట్ల ఇండ్లు మంజూరు చేయగా,2.69 కోట్ల ఇల్లు నిర్మాణం పూర్తయ్యాయి. తెలంగాణలో ఈ పథకం కింద లక్షలాది ఇల్లు నిర్మాణం జరుగుతుంది.
ఈ పథకానికి అర్హతలు: PMAY-U కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) తక్కువ ఆదాయ వర్గాలు (LIG) మధ్య ఆదాయ వర్గాలు (MIG) వారికి గృహాల రుణాలపై 6.5%, 4%, 3% వడ్డీ సబ్సిడీ అందించబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లో వారికి రూ.1.30 లక్షలు అందించబడుతుంది. దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు.
ఆర్థికంగా వెనుకబడిన వారికి వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకూడదు. తక్కువ ఆదాయ వర్గాల వారికి రూ. 3లక్షల నుంచి 6లక్షల వరకు ఆదాయం ఇంచకూడదు. మధ్య ఆదాయ వర్గాల వారికి వార్షిక ఆదాయం రూ. 6లక్షల నుంచి 12 లక్షలకు మించకూడదు.
ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించవలెను లేదా pmayg.nic.in పోర్టర్ లో దరఖాస్తు చేయండి.