పబ్లిసిటీ కోసమే కాస్టింగ్ కౌచ్..!

-

యాంకర్ గా జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన అనసూయ బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దుమ్ముదులిపేస్తుంది. యాంకర్ గా స్మాల్ స్క్రీన్ షోస్ చేస్తూ అలరిస్తున్న అనసూయ సినిమాల్లో కూడా తనకు తగిన పాత్రలను ఎంచుకుంటుంది. లేటెస్ట్ గా అనసూయ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కథనం. శుక్రవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సినిమాలో అనసూయ లీడ్ రోల్ చేయడం విశేషం.

ఇక ఈమధ్య జరిగిన ఇంటర్వ్యూస్ లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది అనసూయ. హీరోయిన్స్ లైంగిక వేధింపుల గురించి కాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ పెద్ద గొడవే జరుగుతుంది. మీటూ అంటూ కొందరు బాలీవుడ్ స్టార్స్ తమకు జరిగిన వేధింపుల గురించి చెప్పారు. అయితే కాస్టింగ్ కౌచ్ అంటూ కొందరు పబ్లిసిటీ కోస రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది అనసూయ. నిజంగా వేధింపులు జరిగిన వారు ప్రశ్నిస్తే బాగుంటుంది. కాని ఇదేదో పబ్లిసిటీగా వాడి రాద్దాంతం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. నిజంగా వేధింపులు జరిగిన వారు మాత్రమే స్పందిస్తే బాగుంటుందని అన్నది అనసూయ. అంతేకాదు చిత్ర పరిశ్రమలోనే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పలేం. అన్నిచోట్ల జరుగుతాయి కాని గ్లామర్ ఇండస్ట్రీ అంటే అందరి కన్ను ఉంటుంది అందుకే దీని మీద ఎక్కువ డిస్కస్ చేస్తారని చెప్పింది అనసూయ.

Read more RELATED
Recommended to you

Latest news