ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎట్టకేలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నారా లోకేష్ పోటీ చేయబోయే స్థానాన్ని కూడా దాదాపుగా ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
నారా లోకేష్ రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం. భీమిలిలో తమకు ఉన్న అనుకూలత దృష్ట్యా లోకేష్‌ను అక్కడి నుంచే పోటీ చేయిస్తే బాగుంటుందని బాబు అనుకుంటున్నారట. అందుకనే దాదాపుగా అదే స్థానం నుంచి లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చి ఆయన్ను ఎంపీగా పోటీ చేయాలని సీఎం చంద్రబాబు కోరుతున్నారని సమాచారం. ఈ క్రమంలో నారా లోకేష్ పోటీ చేయనున్న తొలి అసెంబ్లీ స్థానం భీమిలి అని తెలుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు నారా లోకేష్‌ను ఇదే స్థానం నుంచి పోటీ చేయిస్తుండడానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది.
భీమిలి నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. పార్టీ ఆవిర్భావం తరువాత 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఈ నియోజకవర్గంలో గెలిచాక వరుసగా 1985, 1989, 1994 లలోనూ టీడీపీ భీమిలిలో విజయం సాధించింది. 2004, 2009 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ పరాజయం పాలైంది. అయినప్పటికీ భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి ఓటు బ్యాంకు బాగానే ఉందట. అలాగే ఒకప్పుడు ఎన్‌టీఆర్ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారట. ఈ క్రమంలో భీమిలిలో తమకు ఉన్న అనుకూలత దృష్ట్యా లోకేష్‌ను అక్కడి నుంచే పోటీ చేయిస్తే బాగుంటుందని బాబు అనుకుంటున్నారట. అందుకనే దాదాపుగా అదే స్థానం నుంచి లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ పరిస్థితి అంత బాగా ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మొత్తం వైకాపా గాలి వీస్తుందని, ఈ క్రమంలో అనుకున్నది జరగకపోతే మాత్రం భీమిలిలోనూ టీడీపీ ఓటమి ఖాయమవుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరి సీఎం బాబు, చినబాబులను చూసి భీమిలి ప్రజలు ఓట్లు వేస్తారో, లేదో.. వేచి చూస్తే తెలుస్తుంది..!