దాడి వీరభద్రరావు విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత. తన రాజకీయ చరిత్రలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎమ్మెల్సీగానూ పనిచేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలోకి వలసల జోరు పెరుగుతోంది. ఇప్పటికే అధికార టీడీపీకి షాక్ ఇస్తూ చాలామంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఇవాళ జగన్ ను కలిసిన ఆయన పార్టీలో చేరారు. ఈసందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటుగా దాడి కొడుకు రత్నాకర్ కూడా వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
దాడి వీరభద్రరావు విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత. తన రాజకీయ చరిత్రలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎమ్మెల్సీగానూ పనిచేశారు.
చంద్రబాబుది మల్టీ టంగ్..
వైసీపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన దాడి.. చంద్రబాబుది డబుల్ టంగ్ కాదు.. మల్టీ టంగ్ అని మండిపడ్డారు. జగన్ లా సుదీర్ఘంగా పాదయాత్ర చేసినవాళ్లు ఎవరూ లేరని.. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారని.. ఈసారి జగన్ సీఎం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ఇదే విశాఖ జిల్లాకు చెందిన మరో నేత సతీశ్ వర్మ కూడా వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వర్మ ఇవాళ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనతో పాటు దేవరపల్లి ఎంపీపీ, ఆయన అనుచరులు, ఇతర నాయకులు వైసీపీలో చేరారు.