అనసూయ అతనికి గాలం వేస్తుంది

-

బుల్లితెర మీద యాంకర్ గా తన హవా కొనసాగిస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా అడపాదడపా కనిపిస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో మెప్పించిన అనసూయ రీసెంట్ గా వచ్చిన ఎఫ్-2 సినిమాలో కూడా సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇదిలాఉంటే అటు యాంకర్ గా కొనసాగిస్తూనే సినిమాల్లో ఫుల్ బిజీ అవ్వాలని చూస్తుంది అనసూయ. అందుకే ఆఫర్స్ కోసం హీరోలకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందట.

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ తో పాటుగా ఓ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుందట. ఆ పాత్ర తనకు కావాలని అనసూయ విజయ్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందట. అనసూయ చేస్తే ఆ పాత్రకు క్రేజ్ కూడా వస్తుందని దాదాపు ఆమెను కన్ఫాం చేసే ఆలోచనలో ఉన్నారట. నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. మరి విజయ్ ప్రొడక్షన్ లో వస్తున్న సినిమాలో అనసూయ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version