ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన కుక్క.. కానీ?

-

అవును.. మీరు పైన ఫోటోలో చూస్తున్న ఆ కుక్క ప్రపంచంలోనే అత్యంత అందమైనది. ముద్దొస్తున్నది కదా. కానీ.. దాన్ని ఇక మీరు ముద్దాడలేరు. ఎందుకంటే.. అది చనిపోయింది. అవును… పమేరినియన్ జాతికి చెందిన బూ అనే ఈ కుక్క గుండె సమస్యతో చనిపోయింది. దాని వయసు 12 ఏళ్లు. అది మామూలు కుక్కేం కాదు.. అది సోషల్ మీడియా స్టార్. అవును.. దానికి 1.7 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. దానికి వరల్డ్ క్యూటెస్ట్ డాగ్ అనే బిరుదు కూడా ఉందండోయ్.

గత సంవత్సరం నుంచే దానికి కష్టాలు మొదలయ్యాయి. దాని బెస్ట్ ఫ్రెండ్ బడ్డీ అనే కుక్క కూడా గత సంవత్సరం మరణించిందట. అప్పటి నుంచి బూ దిగులుగా ఉండేదట. బడ్డీపై రంది పెంచుకున్న బూ… హార్ట్ సమస్యలతో మరణించిందని దాన్ని పెంచుకున్న యజమాని తెలిపాడు. ఇంతకీ ఈ బూది ఏ ఊరు అంటారా? అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో.

Read more RELATED
Recommended to you

Exit mobile version