అనసూయకు మెగా ఛాన్సులు.. ఆ ఫ్యామిలీకి ఆమె లక్కీ అట..!

-

యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన వీర ప్రతాపం చూపిస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఛాన్సులే ఎక్కువ అందుకుంటుంది అనసూయ. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించిన అనసూయ. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త రోల్ లో అదరగొట్టింది.

ఆ సినిమాలో అనసూయ నటనకు అందరు ఫిదా అయ్యారు. సోలో సినిమాలను చేస్తూ వస్తున్న అనసూయ లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. సైరా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో అనసూయ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట. ఇందుకు గాను అమ్మడు భారీగానే రెమ్యునరేషన్ అడిగిందని తెలుస్తుంది.

జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్నా సరే సిల్వర్ స్క్రీన్ పై సినిమా సినిమాకు క్రేజ్ తెచ్చుకుంటుంది అనసూయ. మధ్య మధ్యలో ఫోటో షూట్స్ తో కూడా ఆమె అలరిస్తుంది. మెగా ఫ్యామిలీలో ఛాన్స్ అంటే మాములు విషయం కాదు మరి అనసూయని వారు లక్కీ అనుకుంటారో ఏమో కాని వరుస అవకాశాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news