Tamanna- Anasuya: ‘బాహుబ‌లి బ్యూటీ’తో కాద‌నీ… ‘రంగ‌మ్మ‌త్త’ను రంగంలోకి ..

-

Tamanna- Anasuya: మిల్కిబ్యూటీ తమన్నా.. లైఫ్ ఇస్ బ్యూటీ పుల్ అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి అమ్మ‌డు. వ‌రుస విజ‌యాల‌తో దూసుక‌పోతుంది. త‌న న‌ట‌న‌తో స్టార్ హీరోయిన్ల స‌ర‌స‌న నిలిచింది. కేవలం ఈ అమ్మ‌డు సినిమాలకే ప‌రిమితం కాకుండా.. ఎండార్స్‌మెంట్‌లు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు చేస్తే త‌న స‌త్తా చాటారు. ఇటీవ‌ల ఈ బ్యూటీ మ‌రో అడుగుముందుకేసి.. బుల్లి తెర మీద అడుగుపెట్టింది.

దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ అందుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈషోకు హోస్ట్‏గా మారింది. అయితే వెండి తెరపై తమన్నాకు ఉన్న క్రేజ్ బట్టి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు భారీగానే డిమాండ్ చేసిందట. అందుకు నిర్వ‌హ‌కులు కూడా ఓకే చెప్పార‌ట. అయితే.. ఆమె హోస్‌గా ఉన్న‌మాస్టర్ చెఫ్ షోకు ఆశించినంత ఆదరణ మాత్రం రావడం లేదంట‌. ఎవరు మీలో కోటీశ్వరులుల, బిగ్ బాస్ 5 సీజన్ ల ముందుమాస్టర్ చెఫ్ నిలబడలేకపోతుంద‌ట‌.

వారాంతంలో చాలా తక్కువ టీఆర్పీలను అందుకుంది. ఈ షో నిర్మాణానికి పెట్టిన ఖ‌ర్చులు కూడా రావ‌డం లేదంట‌. రాబడి కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నట్లుగా భావిస్తున్న‌ర‌ట నిర్వ‌హకులు. దీంతో అగ్రిమెంట్ ప్రకారం తమన్నాతో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు చిత్రీకరించి.. ఆమెను తప్పించారని సమాచారం. మిల్కీ బ్యూటీ తమన్నా స్థానాన్ని భర్తీ చేసేందుకు టాలీవుడ్ రంగమ్మత్త యాంక‌ర్ అన‌సూయ‌ను తీసుకోనున్న‌ట్టు తెలుస్తుంది.

ఇక నుంచి మాస్టర్ చెఫ్ షోను బుల్లితెర యాంకర్ అనసూయ హోస్ట్ చేయబోతున్నట్లుగా టాక్. అనసూయ ఎంట్రీతో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం సక్సెస్ కావడం ఖాయమంటున్నారు. అలాగే బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు షోలతోపాటు.. మాస్టర్ చెఫ్ షో దూసుకోపోవడం ఖాయమంటున్నారు. మరి చూడాలి నిజంగానే… అనసూయ మాస్టర్ చెఫ్ గతిని మారుస్తుందా ? లేదా ? అని

పెండింగ్‌లో ఉన్న ఎపిసోడ్‌ల్లో అన‌సూయ హోస్ట్ గా చేయ‌నున్న‌ట్టు , ఈ మేర‌కు కొన్ని ఎపిసోడ్స్‌
షూట్ చేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. షో కోసం అనసూయ భారీగా ఛార్జ్ చేస్తోందట‌. అయితే.. తమన్నా తిరిగి షోకి వ‌స్తుందా? లేదా? అనసూయనే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుందా ? అనే వాటిపై క్లారిటీ ఇంకా రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news