అంగరంగ వైభవంగా జరిగిన యాంకర్ లాస్య సీమంతం (వీడియో)

బుల్లితెర మీద తన యాంకరింగ్ తో అలరించిన లాస్య రెండేళ్ల క్రితం తన స్నేహితుడు మంజునాథ్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. 2017 ఫిబ్రవరి 15న వీరి వివాహం జరిగింది.

యంకర్ గా ఎన్నో క్రేజీ షోస్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన లాస్య రెండు మూడు సినిమాలు కూడా చేసింది. ప్రస్తుతం తల్లి కాబోతున్న లాస్య కుటుంబసభ్యుల సమక్షంలో సీమంతం జరుపుకుంది.ప్రస్తుతం లాస్య సీమంతం వీడియో మీడియాలో చెక్కర్లు కొడుతుంది. పెళ్లి తర్వాత తన లైఫ్ ఇంకా కలర్ ఫుల్ గా మారింది అని ఎప్పుడు చెబుతూ వచ్చే లాస్య సీమంతం వేడుకలో చూడముచ్చటగా ఉంది. పెళ్లి తర్వాత పెద్దగా షోలు చేయని లాస్య కొద్దిపాటి బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. డెలివరీ తర్వాత టైం చూసుకుని మళ్లీ లాస్య తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.