టీడీపీ టికెట్ ఇచ్చినా పారిపోతున్న అభ్యర్థులు.. అసలేం జరుగుతోంది టీడీపీలో?

-

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఓటమి తప్పదని టీడీపీ అభ్యర్థులకు ముందే తెలిసిపోయిందా? అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారా? ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తే అలాగే ఉన్నాయి…

కొంతమంది టికెట్ కోసం పడరాని పాట్లు పడుతుంటారు. కానీ.. ఏపీలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. టీడీపీ నుంచి టికెట్ ఇచ్చినా కూడా మాకొద్దు బాబోయ్ అంటూ అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. టికెట్ ఇచ్చి ప్రచారం చేసుకోపోండని చెప్పినా.. ప్రచారాన్ని మధ్యలో వదిలేసి అసలు అధినాయకత్వానికే టచ్ లో లేకుండా పోతున్నారు. దీంతో అధికార టీడీపీ నుంచి బీఫామ్ లు దక్కేది ఎందరికి. బీఫామ్స్ దక్కినా నామినేషన్ వేసేది ఎందరో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

TDP Srisailam candidate becomes inactive in tdp

నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టుండి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇప్పుడు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేడట. ఆయన ఇవాళ ఉదయం నుంచి అసలు టీడీపీ నాయకులకే టచ్ లో లేకుండా పోయాడట. దీంతో వెంటనే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి రంగంలోకి దిగారట.


ఎవరీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి?

బుడ్డా రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఎమ్మెల్యే. 2014 లో వైసీపీ తరుపున గెలిచిన బుడ్డా.. టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లోనూ ఆయనకు శ్రీశైలం నుంచే టికెట్ ఖరారయింది. కానీ.. ఆయన ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయడానికి అనాసక్తితో ఉన్నారట. తను చేయించిన సర్వే ప్రకారం.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన శిల్పా చక్రపాణి రెడ్డి వైపే శ్రీశైలం ప్రజలు ఉన్నట్టు తేలిందట. దీంతో ఆయన ప్రచారం చేయకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. అయితే.. వైసీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లా పర్యటన రోజే బుడ్డా కనిపించకుండా పోవడంతో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది.

వైసీపీలోకి రానున్నారా?

టీడీపీ నుంచి పోటీ చేసే ఆసక్తి లేకపోతే మరి.. బుడ్డా వైసీపీ నుంచి పోటీ చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే.. బుడ్డాకు ఇప్పుడు వైసీపీ సీటు ఇవ్వలేదు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇటీవలే ఖరారయ్యారు. అయితే.. భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇచ్చినా చాలు.. వైసీపీలో చేరడానికి బుడ్డా సిద్ధంగా ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news