ఫ్రెండ్స్‌తో ర‌చ్చ ర‌చ్చ చేసిన యాంక‌ర్ రష్మీ.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

-

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌ అంటే తెలియని వారు ఉండరు. బుల్లితెర యాంకర్ గానే కాదు అవకాశాలు వచ్చినప్పుడల్లా సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ భామ. కరెంట్, గుంటూరు టాకీస్ మొదలగు చిత్రాలలో నటించి మంచి పేరును తెచ్చుకుంది. ఈ క్ర‌మంలోనే యూత్‌లో కూడా ఈ జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. యాంకర్‌గా, యాక్టర్‌గా ఫుల్ బిజీగా ఉన్న రష్మీ గౌతమ్.. భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకోవడం వెనుక జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కూడా కారణమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొన్నేళ్లుగా వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, పెళ్లి కూడా చేసేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ జంటపై యూట్యూబ్‌లో ఎన్నో కథనాలు వచ్చాయి. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. తాజాగా తన స్నేహితులతో కలిసి కారులో ఆడుతూ పాడుతూ రష్మీ ర‌చ్చ‌ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి వైర‌ల్ అవుతోంది. ఓ కారులో ఓ పాటకు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆమె డ్యాన్స్ వేసింది. కారులో ప్రయాణిస్తోన్న సమయంలో ఈ వీడియో తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news